IPL 2026 | సొంత గడ్డపై పంజాబ్‌కు సవాల్

IPL 2026 | సొంత గడ్డపై పంజాబ్‌కు సవాల్

​IPL 2026 | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఆసక్తికరమైన సమరానికి రంగం సిద్ధమైంది. న్యూ చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలుచుకుంది. రాజస్థాన్ యువ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో హోమ్ గ్రౌండ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగనుంది. ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లు, విధ్వంసకర ఆటగాళ్లు ఉండటంతో ఈ పోరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సొంత గడ్డపై పంజాబ్ భారీ స్కోరు సాధిస్తుందా, లేక రాజస్థాన్ బౌలర్లు వారిని తక్కువ స్కోరుకే కట్టడి చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.