కంచె చేను మేస్తే….

కంచె చేను మేస్తే….
ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో సీట్ చేసిన కర్ణాటక మద్యం మాయం?…
379 కర్ణాటక మద్యం బాటిల్స్అ క్రమంగా తరలిస్తున్న బాటిల్స్ ను స్వాధీనం..
కేసు నమోదు చేసిన డోన్ పోలీసులు
విచారణ జరు జరుపుతామన్న జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎక్సైజ్ శాఖలో అధికారులు ఆడింది ఆట పాడిందే పాటగా సాగిందని ఆరోపణలు గతంలో వినిపించేవి. ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేసి నిల్వ ఉంచిన కర్ణాటక మద్యం ను కార్యాలయంలో ఉంచగా ఓ అధికారి వాటిని అక్రమంగా ఓ వ్యక్తికి అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై నంద్యాల జిల్లాలో మంగళవారం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని డోన్ డివిజన్లోని ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ చేసి నిల్వ ఉంచిన 379 కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లను కారులో తరలిస్తుండగా డోన్ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డోన్ డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ప్యాపిలికి చెందిన సోమనాథ్ అనే వ్యక్తికి ఎక్సైజ్ అధికారి అక్రమంగా అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన 379 మద్యం బాటిల్ లను అర్ధరాత్రి సమయంలో ఏపీ 26 ఏసీ 0972 కారులో అక్రమంగా తరలిస్తుండటంతో పోలీసులు తనిఖీలు నిర్వహించే సమయంలో ఈ మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నా రు. డోన్ పట్టణ పరిసర ప్రాంతంలో చాకిరే వు మెట్ట దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అక్కడ పట్టుబడింది.
అందులో గల వ్యక్తిని విచారించగా డోంట్ పట్టణ ఎక్సైజ్ అధికారి స్వయంగా అమ్మడం జరిగిందని పోలీసులకు తెలపటం విశేషం. ఈ సంఘటనపై పోలీసులు క్రైమ్ పీసీ నెంబర్ 54/2026 మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ అధికారిపై గతంలో కూడా పలు ఫిర్యాదులు వచ్చాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటక నుంచి మద్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినటువంటి ప్రాపర్టీని ఇతరులకు అమ్మే ధైర్యం ఎలా వచ్చిందంటూ దీని వెనక ఎవరైనా హస్తముందా?… అంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రభుత్వానికి సరెండర్ చేస్తాం… జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్..
డోన్ ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ చేసిన ప్రాపర్టీ కర్ణాటక మద్యం బాటిల్ 379 ని అక్రమంగా అమ్ముకున్నారన్న సంఘటనపై జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ అధికారి రవికుమార్ ను ఆంధ్రప్రభ బ్యూరో వివరణ అడగగా డోంట్ సిఐ పై వచ్చిన అభియోగాలు ఆరోపణలపై పై అధికారుల ఆదేశాల మేరకు వారిని ప్రభుత్వానికి సరెండర్ చేయటం జరుగుతుందని తెలిపారు. తదుపరి విచారణ ప్రారంభిస్తామన్నారు. విచారణలో నిజమని తేలితే సివియర్ గా పనిష్మెంట్ ప్రపోజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు నుంచి విచారణ ప్రారంభిస్తున్నామని రవికుమార్ తెలిపారు.
