బాల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

బాల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం

గట్టుప్పల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బాల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ నామని జగన్నాథం, జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ అధ్యక్షులు బయన్నతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలని, క్రీడల వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని, శరీరం దృఢంగా తయారవుతుందని అన్నారు. వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల ప్రతిభను పెంపొందించేందుకు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు కర్నాటి మల్లేశం, కోచ్ పగిళ్ల జంగయ్య, బండారు అంజయ్య,కర్నాటి గోవర్ధన్, గంట శ్రీశైలం, గణేష్, సీనియర్ క్రీడాకారులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply