యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి: ప్రభుత్వ విప్ విజయరమణారావు

యోగా సాధన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి: ప్రభుత్వ విప్ విజయరమణారావు

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో యోగా సాధనను అలవాటు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ పోస్టర్‌ను ఆయన శుక్రవారం అధికారులతో కలిసి విడుదల చేశారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 21న ఆదివారం ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖ అధికారులు డాక్టర్ కేశవ రెడ్డి, అరుణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.