INDvsAFG Rain Threat | అఫ్గాన్‌తో ఇండియా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
INDvsAFG Rain Threat | అఫ్గాన్‌తో ఇండియా మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
INDvsAFG Rain Threat | వాన పడుతుండటంతో టాస్ ఆలస్యం
ధర్మశాలలో ఎడతెరిపిలేని వర్షం
మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితి
హిమాచల్‌కు ఆరెంజ్ అలర్ట్..
అవసరమైతే డక్‌వర్త్-లూయిస్ విధానం అమలు
INDvsAFG Rain Threat | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ధర్మశాల: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఉదయం నుంచే మేఘావృత వాతావరణం నెలకొనగా, మ్యాచ్ ప్రారంభానికి ముందు మళ్లీ వర్షం కురవడంతో టాస్ ప్రక్రియ ఆలస్యమైంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) స్టేడియం పరిసరాల్లో వర్షం కొనసాగుతుండటంతో మైదాన సిబ్బంది కవర్ల సహాయంతో పిచ్‌ను రక్షించే ప్రయత్నాలు చేపట్టారు. వర్షం తీవ్రత తగ్గిన తర్వాతే మ్యాచ్ ప్రారంభంపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
శుక్రవారం సాయంత్రం నుంచే ధర్మశాలలో వర్షాలు కురుస్తుండగా, శనివారం ఉదయం కూడా చిరుజల్లులు పడ్డాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశముందని ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఒకవేళ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించి ఓవర్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడితే డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (డీఎల్ఎస్) విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది. దీంతో అభిమానులు వర్షం తగ్గి మ్యాచ్ పూర్తి స్థాయిలో జరగాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
