Hyderabad Flood Risk | వరదల భయంతో హైదరాబాద్
Hyderabad Flood Risk | వరదల భయంతో హైదరాబాద్
Hyderabad Flood Risk | చిన్న వర్షానికే కాలనీలు జలమయం..
నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమా?
డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడి..
ప్రజల్లో ఆందోళన..
Hyderabad Flood Risk | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : వర్షాకాలం ప్రారంభమైన వెంటనే హైదరాబాద్ నగరంలో వరదల భయం మళ్లీ ప్రజలను కలవరపెడుతోంది. చిన్న వర్షానికే కొన్ని కాలనీలు నీటమునిగిపోతుండటం, నాలాల ఆక్రమణలు, పాతబడిన డ్రైనేజీ వ్యవస్థ సమస్యలు నగర వాసులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. వర్షం వచ్చిందంటే.. ఎక్కడిక్కడ ట్రాఫిక్ ఆగిపోయి.. గమ్య స్థానాలకు వెళ్లాలంటే.. నరకం కనిస్తుంటుంది జనాలకు.
Hyderabad Flood Risk | చిన్న వర్షానికే కాలనీలు జలమయం..
హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు స్వల్ప వర్షానికే నీటితో నిండిపోతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా పాతబస్తీ, బోడుప్పల్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామని చెబుతుంటుంది కానీ.. పరిస్థితి మాత్రం మారడం లేదు.

Hyderabad Flood Risk | నాలాల ఆక్రమణలే ప్రధాన కారణమా?
నాలాలపై అక్రమ నిర్మాణాలు, చెత్త పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహం అడ్డుకుపోతోందని నిపుణులు చెబుతున్నారు. వర్షపు నీరు సక్రమంగా బయటకు వెళ్లకపోవడంతో కాలనీలు జలమయమవుతున్నాయి. నగర విస్తరణతో సహజ నీటి మార్గాలు తగ్గిపోవడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. దీని పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Hyderabad Flood Risk | డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడి..
పాత డ్రైనేజీ వ్యవస్థ పెరుగుతున్నా జనాభాకు తగిన విధంగా విస్తరించలేకపోతోందని అధికారులు అంగీకరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైన్లు మూసుకుపోవడం, మురుగు నీరు పొంగిపొర్లడం వంటి సమస్యలు తరచుగా కనిపిస్తున్నాయి. దీంతో ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతోంది. అయితే.. వర్షకాలం వచ్చినప్పుడే అధికారులు దీని గురించి స్పందించడం.. అప్పటికప్పుడు డ్రైనేజీకి ఏదో మరమ్మత్తులు చేస్తున్నారు.

Hyderabad Flood Risk | ప్రజల్లో ఆందోళన..
వర్షాకాలంలో ఇదే పరిస్థితి పునరావృతం కావడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలని నగర పాలక సంస్థను కోరుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు. నాలాల ఆక్రమణల తొలగింపు, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వర్షపు నీటి నిల్వ ప్రాజెక్టులు, నియంత్రణ చర్యలు వంటి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రతిసారీ వర్షాకాలంలో ఇదే సమస్య కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. మరి.. వర్షాకాలం వస్తుంది కాబట్టి అధికారులు.. ముందస్తు జాగ్రత్తలు.. అలాగే శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.

CLICK HERE TO READ Cyber Fraud | విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58.94 లక్షల దోపిడీ
