ఇంద్రకీలాద్రిపై కీలక భేటీకి రంగం సిద్ధం..

ఇంద్రకీలాద్రిపై కీలక భేటీకి రంగం సిద్ధం..

ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్టుబోర్డు సమావేశం ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని దేవస్థాన అధికారులు వెల్లడించారు.

ఇంద్రకీలాద్రి కొండ దిగువన బ్రాహ్మణవీధి జమ్మిదొడ్డిలోని సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. ఈవో సేన నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ ఆధ్వర్యంలో ట్రస్టుబోర్డు సమావేశం నిర్వహించనున్నారు.

సమావేశంలో దేవస్థాన పరిపాలన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులతో పాటు ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.