గ్రంథాలయంలో ఆకట్టుకున్న పుస్తక ప్రదర్శన

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా శుక్రవారంనాడు జుక్కల్ మండల కేంద్రంలోని గ్రంథాలయంలో నిర్వహించిన పుస్తక ప్రదర్శన ఆకట్టుకుంది. గ్రామసర్పంచ్ భర్త,మాజీ ఏఎంసీ మాజీ చైర్మన్ కే.సాయగౌడ్ వార్డు సభ్యుడు గయేక్వాడ్ విట్ఠల్,ఎస్టిడి సురేష్ ముందుగా గ్రంథాలయంలో శ్రీ సరస్వతి పూజను నిర్వహించారు.

గ్రంథాలయాలు విజ్ఞాన బండారాలని, గ్రంథాలయాలు ఉద్యోగ కల్పనకు కావలసిన పుస్తకాలతో పాటు, సైన్స్, ఆధ్యాత్మిక, చరిత్ర, భక్తి, వినోదాన్ని అందించే అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి విద్యావంతుడు వయస్సుతో నిమిత్తం లేకుండా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి గ్రంథ పాలకుడు రాజు,సిబ్బంది గోపాల్ తో పాటు కటికే నాగరాజు పాల్గొనగా, పాఠకులు,గ్రామపెద్దలు, గ్రామస్తులు పాల్గొని పుస్తక ప్రదర్శనను తిలకించారు.