పవర్ లిఫ్టింగ్ పోటీలలోక్రీడాకారుల సత్తా
పవర్ లిఫ్టింగ్ పోటీలలోక్రీడాకారుల సత్తా
గుడివాడ, ఆంధ్రప్రభ: ఇటీవల రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు పాల్గొని వివిధ విభాగాలలో మెడల్స్ సాధించడం పట్ల స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ స్టేడియం ప్రయాణంలో నేడు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన క్రీడాకారులను స్టేడియం కమిటీ అభినందించి. వారికి మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా తాము నిరంతరం క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించడం జరుగుతుందని. తద్వారా తమ క్రీడాకారులు దేశవ్యాప్తంగా ఎక్కడ క్రీడా పోటీలు జరిగిన వాటిలో పాల్గొని మెడల్స్ సాధించడం జరుగుతుందని తెలియజేశారు.
పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఐదుగురు క్రీడాకారులు వివిధ విభాగాలలో పాల్గొని మెడల్స్ సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అన్నారు. రాబోయే కాలంలో కూడా మరింత ఉత్తమమైన శిక్షణ అందించి క్రీడాకారులను నేషనల్ పోటీలకు సిద్ధం చేస్తామని తెలిపారు.
చిన్నతనం నుండి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు స్టేడియం ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నామని, ఈ క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన వారికి తమ కోచ్ లు తర్వాత కూడా శిక్షణ అందించి వాళ్ళని ఉత్తమ క్రీడాకారులుగా మలిచేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం సంయుక్త కార్యదర్శి కిల్లారపు రంగ ప్రసాద్, స్టేడియం లైఫ్ నెంబర్ లక్ష్మీ కృష్ణ వరప్రసాద్ పాల్గొన్నారు.
