గోదావరి ఉద్ధృతి పెరుగుతోంది.. అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్

మంగపేట, ఆంధ్రప్రభ: గోదావరి నీటి ప్రభావం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగపేట తహశీల్దార్ తోట రవీందర్ సూచించారు. శుక్రవారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని పొదుమూరు, కమలాపురం, అకినేపల్లి మల్లారం తదితర గ్రామాల్లో గోదావరి తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను స్థానిక అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి నీటిమట్టం పెరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

గోదావరి వరద మరింత ఉద్ధృతమైతే అవసరమైన సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడతామని తహశీల్దార్ తెలిపారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ పర్యటనలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్‌తో పాటు ఆయా గ్రామాల జీపీఓలు పాల్గొన్నారు.