Narendra Modi | స్కైరూట్‌కు ప్రధాని అభినందనలు

Narendra Modi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో వేదికగా తొలిసారిగా ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడాన్ని అభినందించారు.

విక్రమ్-1 విజయానంతరం ప్రధాని మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ శాస్త్రవేత్తలతో ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగానికి కొత్త శకానికి నాంది పలికిందని, దేశ యువతకు ఇది స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ప్రైవేట్ రంగం సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్కైరూట్ బృందాన్ని త్వరలోనే స్వయంగా కలుసుకుంటానని ప్రధాని మోదీ తెలిపారు. భారత అంతరిక్ష రంగంలో ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు మరింత వేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

విక్రమ్-1 విజయంతో భారత అంతరిక్ష పరిశ్రమలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని, ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో భారత స్థానం మరింత బలపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.