చదువుతో పాటు ఆటలూ అవసరమే..
మునుగోడు, ఆంధ్రప్రభ : విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి చదువుతో పాటు ఆటలు కూడా అవసరమని నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పులిపలుపుల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళావతి అన్నారు. ఈరోజు పాఠశాల పూర్వ విద్యార్థులు రూ.10 వేల విలువైన క్రీడా సామగ్రిని విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆటలు విద్యార్థులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చదువులో రాణించేందుకు దోహదపడతాయని తెలిపారు.
తాము చదువుకున్న పాఠశాలకు అవసరమైన క్రీడా సామగ్రిని అందించిన పూర్వ విద్యార్థుల సేవాభావం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో 6వ వార్డు సభ్యురాలు పగిళ్ల అనూష రాము,జనగాం నరసింహ,సైదులు, స్వామి,సాయి,జనగాం స్వామి,సింగం స్వామి ఉపాధ్యాయులు పీఆర్టీయూటీఎస్ మండల శాఖ అధ్యక్షుడు యూసుఫ్ పాషా,వెంకటయ్య, రవీందర్,నాగరాజు, రోహిణి,మేరీ పాల్గొన్నారు.
