ప్రజల సుఖశాంతి కోసం శ్రీవారికి ప్రత్యేక పూజలు..
- మోత్కూరులో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే గాధరి కిశోర్ కుమార్
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాల్లో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాధరి కిశోర్ కుమార్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు డా. గాధరి కిశోర్ కుమార్‌కు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డా. గాధరి కిశోర్ కుమార్‌ను శాలువాతో సన్మానించి, జ్ఞాపిక (మెమెంటో) అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ముప్ప వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లేశం, గౌరవాధ్యక్షుడు చంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కె. యాకూబ్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, పట్టణ అధ్యక్షుడు జంగ శ్రీను, ఉద్యమ నాయకుడు, సినీ గేయ రచయిత అభినయ శ్రీనివాస్, కౌన్సిలర్లు కొండ శోభ–సోమల్లు, నల్ల మధు, మహిళా అధ్యక్షురాలు మల్లం అనిత, బీఆర్ఎస్ నాయకులు గిరగాని శ్రీనివాస్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
