India Test | లంచ్ స‌మ‌యానికి 475/6

India Test | లంచ్ స‌మ‌యానికి 475/6

India Test | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు లంచ్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ 14 పరుగులు, మానవ్ సుథార్ 9 పరుగులతో నిలిచారు. రెండో రోజు ఆటలో భారత్‌కు కీలక వికెట్లు పడ్డాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 126 పరుగులు సాధించగా, రిషబ్ పంత్ వేగంగా ఆడి 81 పరుగులు చేసి ఔటయ్యాడు. ధ్రువ్ జురెల్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. గిల్, పంత్ జోడీ నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్ స్కోరు చేసేలా పునాది వేశారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ సలీమ్ సఫీ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అతను 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

తొలి రోజు నుంచే భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 368/3 వద్ద నిలిచింది. కేఎల్ రాహుల్ సెంచరీతో మెరిసి 100 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 81 పరుగులు సాధించాడు. శుభ్‌మన్ గిల్ తొలి రోజు 103 పరుగులతో, రిషబ్ పంత్ 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

India Test

Leave a Reply