జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

ఇటిక్యాల, ఆంధ్రప్రభ : 44వ జాతీయ రహదారి పై తిరుపతి నుండి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు ఆదివారం ప్రమాదానికి గురైంది. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం కోదండపురం స్టేజి సమీపంలో లారీని వెనుక నుండి బస్సు ఢీ కొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ​బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని సాయిశ్రీజ (27), అంజలి (20), చిన్నారులు ఫయిజా, హైజా అని గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కోదండపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, హైవే 44 అంబులెన్స్ ద్వారా బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply