సినీ నటి అషు రెడ్డిపై కేసు నమోదు

సినీ నటి అషు రెడ్డిపై కేసు నమోదు
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : టాలీవుడ్‌కు చెందిన బిగ్‌బాస్ ఫేమ్ సినీ నటి అషు రెడ్డి పై పోలీసు కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. లండన్‌లో స్థిరపడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ధర్మేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు వివరాల ప్రకారం, అషు రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి దాదాపు రూ. 9.35 కోట్లు తీసుకుందని ఆరోపించారు.
ఫిర్యాదుదారు తెలిపిన సమాచారం ప్రకారం.. 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషు రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆమె అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చినట్టు చెప్పిందని పేర్కొన్నారు. ఈ పరిచయం క్రమంగా వ్యక్తిగత సంబంధంగా మారి, పెళ్లి పేరుతో డబ్బులు, బంగారం ఇచ్చినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. పోలీసులు ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు లావాదేవీలు, కమ్యూనికేషన్ రికార్డులు, సంబంధిత ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. సినీ రంగంలో కూడా ఈ కేసు హాట్ టాపిక్‌గా మారింది.
