రైతుల కోసం..

రైతుల కోసం..

వేంసూరు, ఆంధ్రప్రభ : ఖరీఫ్ పంట సాగుకు ముందే రైతులను చైతన్య పర్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టింది. ఈనెల 27 వ తేదీ నుంచి మే నెల 23 వ తేదీ వరకు రైతులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వేంసూరు మండలం వి.వెంకటాపురం గ్రామంలో 27వ తేదీన రైతు సమావేశం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి రామమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డాక్టర్ హేమంత కుమార్, డాక్టర్ శ్రీజన్ తో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు.

భూసార పరీక్షలు, భూమి స్థితికి తగిన పంట ఎంచుకోవటం, మోతాదుకు మించి యూరియా, ఇతర ఎరువులు, పురుగు మందులు వినియోగం కారణంగా జరిగే నష్టాలు వివరించనున్నారు. అలాగే నూతన వ్యవసాయ పద్ధతులు తెలియజేయనున్నారు. పంట మార్పిడి వల్ల జరిగే ప్రయోజనాలు, పండించిన పంటకు మార్కెట్ పరిస్థితులు, ఏ పంటకు డిమాండ్ కలిగి ఉందో తెలియజేయడం, వరి సాగు రకాలు, నీటి వినియోగాన్ని తగ్గించడానికి కావలసిన పద్ధతులు, సేంద్రియ సాగు పద్ధతులు వంటి అనేక వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగులో మెళకువల పై అవగాహన కల్పించనున్నారు. ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్వహించే కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని వ్యవసాయ అధికారి రామమోహన్ కోరారు.

Leave a Reply