అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; విద్యార్థులు పట్టుదలతో చదివి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి తెలిపారు. చౌటుప్పల్ మండలంలోని తూఫ్రాన్ పేట గ్రామ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను గురువారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి సన్మానం చేశారు. ప్రోత్సాక బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా జెడ్పి సీఈవో శోభారాణి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులంతా గోల్ ఎంచుకొని దాన్ని చేరుకోవడం కోసం క్రమశిక్షణతో కృషి చేయాలన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకొని తాము చదివిన పాఠశాలకు, తమను కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సిఈఓ శోభారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత, ఎంపీడీవో బి సందీప్ కుమార్, మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకులు బి విజయకుమార్, పాఠశాల ఉపాధ్యాయుల బృందం, పాఠశాల విద్యార్థులు, తల్లి,దండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply