విద్యార్థులకు సన్మానం..

విద్యార్థులకు సన్మానం..
భువనగిరి, ఆంధ్రప్రభ : మండలంలోని ముగ్ధంపల్లి గ్రామ హైస్కూల్ లో పదవ తరగతి ఫలితలలో ఉత్తీర్ణత సాధించిన 12 మంది విద్యార్థులకు గ్రామ సర్పంచ్ శిగ నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కార్యాలయం ముందు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శిగ నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. ముగ్ధంపల్లి గ్రామం నుండి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు 12 మంది పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అభినందిస్తూ రానున్న రోజులలో మరి ఉన్నతమైన చదువులకు మీకు అన్ని విధాలుగా తోడ్పడుతానని గ్రామం నుండి ఎంబిబిఎస్, ఇంజనీరింగ్, ఐఏఎస్, ఐపీఎస్ విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఆర్థికపరమైన సహాయ సహకారాలు కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో సేవలందించే విధంగా గ్రామ విద్యార్థుల విద్యను అభ్యసించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శెట్టిసోని మల్లేష్, వెంకటేశం, గోపి, శేఖర్ రెడ్డి, ప్రసన్న, శంకర్, బాలకృష్ణ, రాధిక, కే సోమయ్య, కే వెంకట్ రెడ్డి, ఎం సునీత, పి విద్యధారరావు, సిహేచ్ బాలమణి, దుర్గా భవాని నస్రీన్, రమాదేవి, సురేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
