శంకర్ గూడా పంచాయతీ లక్ష్యం ఇదే..

శంకర్ గూడా పంచాయతీ లక్ష్యం ఇదే..

ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో శంకర్ గూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ జాదవ్ రమాబాయి తనయుడు జాదవ్ విజయకుమార్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కొరకు పారిశుద్ధ్య పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. గ్రామ శివారులోని చెరువులో ఉన్న చెత్తను సైతం తొలగిస్తున్నారు. ప్రజల్లో పారిశుద్ధ్యం పరిశుభ్రత పట్ల చైతన్యం కలగాలనే ఉద్దేశంతో విధి స్తంభాల మీద రూప లైటింగ్ లను బిగించడం జరిగిందట. చుట్టుపక్కల గ్రామస్తులు లైటింగ్ గురించి చర్చించినప్పుడు పారిశుద్ధ్యం పట్ల కూడా మాట్లాడుకుంటారనే ఉద్దేశంతో లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రప్రభతో స్థానిక సర్పంచ్ తెలిపారు. ఉట్నూర్ నుండి ఆదిలాబాద్ వెళ్లే ప్రధాన రహదారైన మార్గమధ్యంలో ఉన్న శంకర్ గూడా గ్రామంలో రాత్రి వేళలో స్తంభాల మీద మెరుస్తున్న లైటింగ్ను చూసి బస్సులో వెళుతున్న ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చుట్టుపక్కల గ్రామపంచాయతీ ప్రజలు మరియు యువత తమ తమ గ్రామాల్లో కూడా రూప్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత సర్పంచులకు డిమాండ్ చేస్తున్నారు. గ్రామపంచాయతీ పారిశుధ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని.. శివారులోని మెండపల్లి ఎక్స్ రోడ్డు నుండి ఇంకేరిగుడ వరకు ప్రధాన రహదారి ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి క్లీన్ చేయడంతో రోడ్డు ప్రమాదాలు జరగవని పేర్కొన్నారు. అలాగే కొబ్బరి గుడా గ్రామం పొలిమేర వరకు రహదారి ఇరువైపుల పిచ్చి మొక్కలను తొలగించి పారిశుధ్యం పట్ల దృష్టి సారించడం జరిగింది. ప్రతి గ్రామంలో పరిశుభ్రత పట్ల దృష్టి సారించి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తూ గ్రామంలోని రేషన్ కార్డ్ లబ్ధిదారులకు వాళ్ల పిల్లల పేర్లను నమోదు చేయించడం.. మరి ఇతరత్రా సమస్యలకు ముందుండి ప్రజలకు సొంత డబ్బులతో సమస్యలను తీరుస్తూ ఆదర్శ గ్రామపంచాయతీ బాటలో శంకర్ గూడా పంచాయతీ పేరు ఉండాలనేది మా సంకల్పమని స్పరంచ్ తెలియచేశారు.

Leave a Reply