పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం

  • నూతన ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి లబ్ధిదారుల కృతజ్ఞతలు
  • ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : నిరుపేదల సొంతింటి కల నిజం చేయడం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో ఊదరి సుశీల – గోపాల్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ జువ్వి నర్సింహ్మ రిబ్బన్ కట్ చేసి నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ​

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… నిరుపేదల సొంత ఇంటి కల, కేవలం కలగానే మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సహకారంతో గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.

రాబోయే రోజుల్లో గ్రామంలో ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సొంతింటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు ఊదరి సుశీల – గోపాల్ దంపతులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, మాజీ ఉపసర్పంచ్ కొంతం బుచ్చిరెడ్డి, మాజీ వార్డు సభ్యుడు రాచకొండ వెంకటేశం, చెన్నోజు విజయ్ చారి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊదరి నర్సింహ, స్వామి తదితరులు పాల్గొన్నారు.