అందుకే.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక

అందుకే.. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంను నిర్వహించడం జరుగుతుందని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తెలిపారు. చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారి పి. రవీందర్ అధ్యక్షతన మండల స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి సందీప్ కుమార్, తహసీల్దార్ వీరబాయి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు కే అలువేలు, ఆయా గ్రామాల సర్పంచులు, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
