రామేశ్వర్ పల్లిలో హోలీ సంబరాలు..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని రామేశ్వర పల్లి గ్రామంలో మంగళవారం హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరికి ఒకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సంబరాలలో కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. పలువురు యువకులు ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు రంగులు చెల్లి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబం రంగుల మయంగా ఉండాలని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు ఆనందోత్సవాల మధ్య వేడుకలు జరుపుకున్నారు.

Leave a Reply