భీమ్‌గల్‌లో ఎస్‌ఆర్‌వో సొంత భవనానికి స్థల పరిశీలన

తహసీల్దార్‌తో కలిసి కాంగ్రెస్ నాయకుల సందర్శన

భీమ్‌గల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌లో ప్రతిపాదిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం (ఎస్‌ఆర్‌వో)సొంత భవనం నిర్మాణానికి సంబంధించి బుధవారం తహసీల్దార్ ఎం.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థల పరిశీలన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అధికారులు ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించి అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యం, భవిష్యత్ అవసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, భీమ్‌గల్ ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సొంత భవనం నిర్మాణం ఎంతో అవసరమని పేర్కొన్నారు.పరిపాలనా ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జేజే నర్సయ్య, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర బాబు, కౌన్సిలర్ మామరి సందీప్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.