నేడు హిందూ ధర్మ సమ్మేళనం

నేడు హిందూ ధర్మ సమ్మేళనం

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో నేడు బుధవారం సాయంత్రం 4 గంటలకు హిందూ ధర్మ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు తౌటం నవీన్, తెలిపారు. హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథి పూజ్య బ్రహ్మా శ్రీ జ్ఞాన చైతన్యనంద స్వామి పాల్గొంటారు అన్నారు. ఇందులో కలశపూజ, వినాయక అభిషేకం, ధార్మిక ప్రవచనాలు, అనంతరం అన్నదానం వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. హిందూ బంధువులు, కుటుంబ సమేతంగా, అధిక సంఖ్యలో పాల్గొని హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని తౌటం.నవీన్ కోరారు.

Leave a Reply