అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ జయంతి వేడుకలు
రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలం పోచంపల్లి గ్రామoలో సర్పంచ్ కేసిరెడ్డి సబిత – ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు పోచంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యధర్శి పింగిలి జ్యోతి, ఉప సర్పంచ్ ముద్దామల్ల రవి, వార్డు సభ్యులు, భగవాన్, సాయిరెడ్డి, రవి, గ్రామ ప్రజలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
