భీమేశ్వరుడికి కేసీఆర్ మనుమడి ప్రత్యేక పూజలు..

వేములవాడ, ఆంధ్రప్రభ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు సోమవారం తన స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

ముందుగా స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భీమేశ్వర స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈఓ రమాదేవి స్వామివారి తీర్థప్రసాదాలను అందించి హిమాన్షును ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు హిమాన్షును పలకరించారు. ఆయన దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.