స్నేహానికి నిలువెత్తు నిదర్శనం.. చిన్నారికి భరోసా

మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన పాలకూరి వెంకన్న మృతితో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు జిల్లా పరిషత్ హైస్కూల్ పలివెల 2003–04 బ్యాచ్ స్నేహితులు ముందుకొచ్చారు.
వెంకన్న పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో స్నేహితులు నగదు సేకరించారు. సేకరించిన మొత్తాన్ని ఈ రోజు పలివెల పోస్టాఫీసులో కుటుంబ సభ్యుల సమక్షంలో పాలకూరి అశ్విత పేరుపై సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.
ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ, కష్టకాలంలో వెంకన్న కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించామని తెలిపారు. చిన్నారి విద్య, భవిష్యత్తుకు ఈ సహాయం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బోయ లింగస్వామి, కుంరెడ్డి నవీన్‌రెడ్డి, పంతంగి రవి, బత్తుల కృష్ణ, పంతంగి స్వామి, కొరుపోలు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
