HIGH ACCiDENT : తప్పిన పెనుప్రమాదం

HIGH ACCIDENT : తప్పిన పెనుప్రమాదం
- ఆస్పరిలో లారీ దగ్ధం
- ప్రాణాలతో డ్రైవర్ హ్యాపీ
ఆస్పరి (కర్నూలు జిల్లా), ఆంధ్రప్రభ :

అధిక వేగంతో బ్రేకులు పడక, రోడ్డు పక్కనే పొలాల్లోని ట్రాన్స్ ఫార్మర్ ను లారీ ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం (Big Accident) తప్పింది. లారీ ఇంజన్ లో మంటలు (Fire in Emgine) చెలరేగి, లారీ సహా గడ్డివాము తగుల బడిన ఘటన చిన్న హోతూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా ఆస్పరి సీఐ గంగాధర్ (Aspari CI Gangadhar) వివరాల ప్రకారం, సోమవారం ఆస్సరి మండల పరిధిలోని చిన్నహోతూరు గ్రామంలో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బళ్లారి నుంచి నంద్యాల వెళ్తున్న 22 చక్రాల కంకర లారీ అతివేగంగా (High speed) (RJ 51 JB 6077) చిన్నహోతురు బస్టాండ్ ( Chinna Hoturu) సమీపంలో స్పీడ్ బ్రేకర్ (Speed breaker) దగ్గర తన ముందు వెళ్తున్న సమయంలో ఎదురుగా లారీ కనిపించింది. ఈ లారీని ఢీ కొడతాననే భయంతో డ్రైవరు బ్రేక్ వేయగా, బ్రేక్ లు పని (Breaks Failed) చేయలేదు.
ఎదుటి లారీని తప్పించపోయి డ్రైవర్ తన కుడి వైపున పొలంలోకి లారీని పోనివ్వగా ,రోడ్డు పక్కన కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ పోల్ ( Electrical Transformer) ని ఢీకొంది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో ( Short Cicuit) లారీ ఇంజన్ భాగంలో మంటలు రేగాయి. ఇంజన్ ఎదుటి టైర్లు, మధ్యలోని 10 టైర్లు ( 10 Tires Fired) కాలిపోయాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు.ఈ ప్రమాదంలో బోయ రంగన్నకు చెందిన వరి గడ్డి (paddy geass), వేరు శెనగ పోట్టు, జొన్న సొప్ప వాము దొడ్డిలోకి మంటలతో లారీ దూసుకు రావటంతో అగ్నిప్రమాదం జరిగింది.
పశువుల గ్రాసం బూడిదైంది. రూ 50,000 వేలు (loss ) నష్టపోయినట్టు రైతు బోయ రంగన్న (Farmer Boya Ranganna) తెలిపారు. విద్యుత్తు శాఖకు కూడా నష్టం వాటిల్లిందన్నారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
