సమర్పించిన ఎజైల్ సెక్యూరిటీ సిబ్బంది..

  • చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ వి.కె. సీనా నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా ఎజైల్ టెండర్ సెక్యూరిటీ సిబ్బంది భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సారె ను బుధవారంసమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి (ఈఓ) వి.కె. సీనా నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్ బొర్రా గాంధీ, ఈఓ శీనా నాయక్ లు జమ్మిదొడ్డి అమ్మవారి విగ్రహం వద్ద సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయలు కొట్టి పూజలను ప్రారంభించారు.

అనంతరం అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి (ఏఈఓ) రమేష్, సెక్యూరిటీ ఇన్‌చార్జ్, సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ గార్డులు, ఆలయ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ భద్రత, భక్తులకు సేవలందించడంలో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ప్రశంసనీయమని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. అమ్మవారి అనుగ్రహంతో ఆలయ సేవలను మరింత అంకితభావంతో కొనసాగించాలని ఆకాంక్షించారు.