Blue Micromoon | నేడు ‘బ్లూ మైక్రోమూన్’ సందడి!

Blue Micromoon | నేడు ‘బ్లూ మైక్రోమూన్’ సందడి!

Blue Micromoon |ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : ఆకాశంలో నేడు ఒక అద్భుతమైన, అరుదైన ఖగోళ వింత ఆవిష్కృతం కానుంది. సాధారణంగా కనిపించే చంద్రుడి కంటే భిన్నంగా, నేడు చంద్రుడు ‘బ్లూ మైక్రోమూన్’ రూపంలో తన ప్రత్యేకతను చాటుకోనున్నాడు. సాయంత్రం వేళ ఆకాశం వైపు చూస్తే, మీరు ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించే అవకాశం ఉంది. ఇంతకీ ఈ ‘బ్లూ మైక్రోమూన్’ అంటే ఏమిటి? ఇది భారత్‌లో ఎందుకు అంత ప్రత్యేకం? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం
ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించే అవకాశం భారత్‌లో కూడా ఉంటుందని భావిస్తున్నారు.

ఏమిటీ ‘బ్లూ మైక్రోమూన్’?
ఒకే నెలలో రెండోసారి పౌర్ణమి రావడాన్ని ‘బ్లూ మూన్’ అని పిలుస్తారు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత దూరంగా ఉండే స్థితిని ‘మైక్రోమూన్’గా పేర్కొంటారు. ఈ రెండు ఖగోళ విశేషాలు ఒకేసారి సంభవించడం వల్ల, నేడు చంద్రుడు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

ఎప్పుడు వీక్షించవచ్చు?
ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి సాయంత్రం 6:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల మధ్య సమయం అత్యంత అనుకూలంగా ఉంటుందని సమాచారం. మేఘాలు లేని నిర్మలమైన ఆకాశం ఉన్నప్పుడు మాత్రమే ఈ దృశ్యం కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. టెలిస్కోప్ అవసరం లేకుండానే, సాధారణ కళ్ళతో కూడా చంద్రుడిని చూడవచ్చు.

CLICK HERE TO READ Kedarnath Yatra | వాన‌లు కురుస్తుండ‌టంతో తాత్కాలిక నిలిపివేత‌

CLICK HERE TO READ MORE

Leave a Reply