మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ: జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఐకేపీ మహిళా సంఘ సభ్యుల కోసం నిర్వహించిన ఉచిత రక్త, వైద్య పరీక్షల శిబిరం విజయవంతమైంది.
జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్, ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్‌తో కలిసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులకు బీపీ, షుగర్, థైరాయిడ్‌తో పాటు వివిధ రకాల రక్త పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
ప్రభుత్వ వైద్యులు డాక్టర్ విఠల్, స్వప్న తమ సేవలను అందించారు. పలువురు మహిళలకు ఉచితంగా మందులు, గోళీలు అందించడంతో పాటు వివిధ రోగాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జుక్కల్ సర్పంచుల సంఘం అధ్యక్షుడు చాకలి కృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రమేష్ దేశాయ్, కాంగ్రెస్ మండల యువజన అధ్యక్షుడు సతీష్ పటేల్, మహిళా సమైక్య అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఏపీఎం వాగ్మారే వందేమాతరం, ఓబీలు, సీసీలు, వీఓఏలు, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
