వధూవరులకు ఎమ్మెల్యే సుజన పెళ్ళికానుక

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని చిట్టినగర్, 46వ డివిజన్ కు చెందిన (లేటు)చుక్క వెంకులు, (లేటు)రమణమ్మ దంపతుల కుమారుడు సతీష్ , పావనిల వివాహం లంబాడీ పేట లోని ఓ చర్చి లో గురువారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ సుజన చౌదరి నూతన వధూవరులకు పెళ్ళికానుక పంపి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయం తరపున సుజనామిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని వధూవరులకు పెళ్లి కానుకను అందజేశారు. కొత్త జంట సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా వధూవరులు బంధుమిత్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు..