పెరుకవాడలో చైన్ స్నాచింగ్.. వృద్ధురాలి మెడలో చోరీ

కరీమాబాద్, ఆంధ్రప్రభ: గ్రేటర్ వరంగల్ 33వ డివిజన్ పెరుకవాడలో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రెండు తులాల బంగారు గొలుసును అపహరించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. పెరుకవాడకు చెందిన వరలక్ష్మి (60) రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంపుకుని పరారయ్యారు.

ఘటనపై సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.