10th| ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

10th| ప‌క‌డ్బందీ ఏర్పాట్లు..

ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వ‌ర‌కు
ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,676 సెంటర్లు ఏర్పాటు
పరీక్షలు రాయ‌నున్న విద్యార్థులు 5,17,727 మంది

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ర్ట‌వ్యాప్తంగా ప‌రీక్ష‌లు హ‌డావిడి కొన‌సాగుతోంది. ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. రేప‌టి నుంచి టెన్త్ ప‌రీక్ష‌లు మొద‌లు కానున్నాయి. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఈ నెల 14 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 16వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది. విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైన ఈ పరీక్షల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. అయితే విద్యార్థులంద‌రూ త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు గంట ముందుగానే చేరుకోవాల‌ని అధికారులు సూచించారు. ఉద‌యం 9.35 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ఉద‌యం 9.35 త‌ర్వాత వ‌చ్చే విద్యార్థుల‌కు అనుమ‌తి ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో కూడిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ సంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ది పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1,582 సెంటర్లు, ప్రైవేట్‌ బడుల్లో 1,094 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ప‌రీక్షా కేంద్రంలోని సిబ్బంది, స్క్వాడ్ ఎవ‌రూ కూడా సెల్ ఫోన్ల‌ను వినియోగించొద్ద‌ని, త‌నిఖీల‌కు వ‌చ్చే అధికారులు కూడా ప‌రీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల‌ను తీసుకెళ్ల‌కూడ‌దు ఉన్న‌తాధికారులు ఆదేశించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన స‌స్పెండ్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. పరీక్షా హాల్లోకి విద్యార్థులు సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడంపై పూర్తి నిషేధం ఉంది.

షెడ్యూల్‌
మార్చి 14న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు)
మార్చి 18న సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ)
మార్చి 23న థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లీష్‌)
మార్చి 28న గణితం
ఏప్రిల్‌ 2న భౌతిక శాస్త్రం
ఏప్రిల్‌ 7న జీవశాస్త్రం
ఏప్రిల్‌ 13న సోషల్‌ స్టడీస్‌
ఏప్రిల్‌ 15న OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ I
ఏప్రిల్‌ 16న OSSC మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ I I