రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…

రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…

కడెం, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కడెం పిఎస్ ఎస్ఐ పి. సాయి కిరణ్ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలోని రోడ్డు భధ్రత కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన కడెం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులతో కలిసి కడెం మండల కేంద్రంలో కవాతు నిర్వహించారు.

తదుపరి విద్యార్థులకు రోడ్డు భద్రత పై అనగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, స్కూల్ బస్ లో కూర్చునే విధానం, పాటశాల పరిసరాలలోని రోడ్డుపై వేగ నియంత్రణ సూచీకలను ఏర్పాటు చేయడం మొదలైన వాటి గురుంచి అవగాహన కార్యక్రమంలో కడెం పి ఎస్ ఎస్సై సాయికిరణ్ వివరించారు. కడెం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి కూడలి వద్ద విద్యార్థులు, ప్రజలతో కలసి మానవ హారం నిర్వహించి పాటశాల విద్యార్థులతో వారి తండ్రులకు హెల్మెట్ పెట్టుకోవడం, సీట్ బెల్ట్ ధరించాలనీ, లేఖలు రాయాలని అది వారి కోసం కాదని, వారిపై ఆధార‌పడి వున్న వారి భార్య పిల్లల కోసమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పెద్దూర్ కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయకుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, జిపి వార్డు సభ్యులు కడెం జడ్పీఎస్ఎస్ పాఠశాల హెచ్ఎం ఎం శ్రీనివాసరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, పలు పార్టీల నాయకులు, కడెం పిఎస్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, వాహనదారులు, యువకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.