ఎల్‌హెచ్‌పీఎస్ యూత్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా బి రమేష్
ఎల్‌హెచ్‌పీఎస్ యూత్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా బి రమేష్
కడెం, ఆంధ్రప్రభ : లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) జాతీయ వ్యవస్థాపకులు బెల్యా నాయక్ ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముదావత్ రాంబాల్ నాయక్ ఆదేశాల మేరకు ఆదివారం నిర్మల్ జిల్లా ఐబీ భవనంలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (జిల్లా ఇన్‌చార్జ్ జాధవ్ అశోక్ కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామానికి బుక్యా రమేష్ ను ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా యువజన అధ్యక్షుడిగా, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా గిరిజన విద్యార్థి విభాగ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువత, గిరిజన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో మరింత బలంగా పనిచేస్తామని తెలిపారు. సమాజ హక్కుల పరిరక్షణతో పాటు విద్య, ఉపాధి అవకాశాల కోసం సంస్థ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ జగేందర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రోహిదాస్, అజ్మీరా మోహన్, భానావత్ అంబాజీ, జాధవ శంకేత్ తదితరులు పాల్గొన్నారు.
