gold rates| షాక్ ఇస్తున్నబంగారం ధరలు

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి వంటి పరిణామాల ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. ఈ వారంనుంచి ధరల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ ధరలు ఈరోజు కూడా భగ్గుమన్నాయి. రేట్లు ఒక్కసారిగా మరింతగా పైకి ఎగబాకి కొనుగోలుదారులకు మరోసారి షాక్ ఇచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,350గా ఉంది. నిన్నటి ధర రూ.1,53,930తో పోలిస్తే ఇవాళ ఒక్కరోజులోనే రూ.1,420 పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,400గా నమోదైంది. నిన్న ఇది రూ.1,41,100గా ఉండగా, ఇవాళ రూ.1,300 మేర పెరుగుదల కనిపించింది.

వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,70,000గా ఉంది. నిన్నటి రూ.2,55,000తో పోలిస్తే ఇవాళ రూ.15,000 పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,75,000గా ఉండగా, నిన్న అది రూ.2,65,000గా ఉంది. దీంతో ఒక్కరోజులోనే రూ.10,000 పెరుగుదల నమోదైంది.

