మామిడి పండ్లలో ఆరోగ్య రహస్యాలు

మామిడి పండ్లలో ఆరోగ్య రహస్యాలు

  • తినే ముందు నానబెట్టడం ఎందుకు ముఖ్యం?

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : మామిడి పండ్లను చూస్తే క్షణమైనా ఆగలేం. వాటి రుచిని ఆస్వాదించేదాకా మనసు నిలవదు. మామిడి పండ్లు రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మం, జుట్టు సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.

అయితే ఈ ప్రయోజనాలన్నీ పొందాలంటే మామిడి పండ్లను తినే ముందు 1–2 గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ వెంటనే తినాలనుకుంటే కనీసం పావుగంటైనా నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పండ్లపై ఉండే మలినాలు తొలగడమే కాకుండా వేడి ప్రభావం కూడా తగ్గుతుంది.

మామిడిపండ్లలో విటమిన్ A, విటమిన్ C, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, కంటి ఆరోగ్యాన్ని కాపాడడం, చర్మం కాంతివంతంగా మారడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు అందిస్తాయి.

మామిడిపండు ఆరోగ్య ప్రయోజనాలు:

క్యాన్సర్ నివారణ: యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

రోగ నిరోధక శక్తి: విటమిన్ C అధికంగా ఉండడం వల్ల తెల్ల రక్త కణాలను పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

జీర్ణక్రియ మెరుగుదల: ఫైబర్, ఎంజైమ్స్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

కంటి ఆరోగ్యం: విటమిన్ A, బీటా కెరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తాయి.

చర్మ సౌందర్యం: కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

గుండె ఆరోగ్యం: పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

తక్షణ శక్తి: సహజ చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

బరువు పెరుగుదల: బరువు పెరగాలనుకునే వారికి మంచి పోషకాహారం.

Leave a Reply