రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతాం..

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతాం..
- ఊట్కూర్ సింగిల్ విండో అధ్యక్షులు బాల్ రెడ్డి
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఊట్కూర్ సింగిల్ విండో అధ్యక్షులు ఎం. బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ ఉపాధ్యక్షులుఎన్. రాంరెడ్డి అన్నారు. బుధవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ సింగిల్ విండో కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పదవీకాలం ముగిసిన ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని రైతులకు సేవలు చేసి రుణం తీర్చుకుంటామన్నారు.
రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వం నిర్వహించిన దాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించి లబ్ధి పొందాలన్నారు. సింగిల్ విండో కార్యాలయం ద్వారా రైతులకు ప్రభుత్వం మంజూరు చేసే ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తామనిఅన్నారు. రైతులు రైతు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం నిర్వహించిన కొనుగోలు కేంద్రాల్లో దాన్యంవిక్రయించిగిట్టుబాటుధర పొందాలన్నారు.
గత పాలన అనుభవంతో రైతులకు రెట్టింపు సేవలు చేస్తామని అన్నారు. తమ సేవలను గుర్తించిన ప్రభుత్వం మరోసారి గడువు పెంచిందని ఇచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. అనంతరం అధికారులు బాధ్యతలు స్వీకరించిన ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో కార్యదర్శి హుస్సేన్, మానిటరింగ్ అధికారిని శ్రీలత, సిబ్బంది మహేష్, మంజుల, తరుణ్ రెడ్డి, మహమూద్, బాబు తదితరులు పాల్గొన్నారు.
