10grams | ఆకాశానికి ధ‌ర‌ల నిచ్చెన

10grams | ఆకాశానికి ధ‌ర‌ల నిచ్చెన

10grams | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం కొనేవారికి బిగ్ షాకింగ్. గత కొంతకాలంగా నెమ్మదించిన గోల్డ్ రేట్లు.. ఇవాళ ఒక్కసారిగా పుంజుకున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు బంగారం, వెండి ధ‌ర‌లు హెచ్చుత‌గ్గులు స్వ‌ల్పంగా ఉన్నాయి. కానీ ఈ రోజు మాత్రం గోల్డ్‌, సిల్వ‌ర్ ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఆకాశాన్ని తాకాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో బంగారం కొనాలనుకునేవారికి ఇది మింగుడు పడని విషయంగా మారింది. ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ యుద్దం మొదలైన క్రమంలో ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.ఇంత భారీగా పెరుగుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇప్పుడు బంగారం కొనాల‌నుకునేవారు ధ‌ర త‌గ్గేవ‌ర‌కు ఆగ‌డం మేలు.

బుధవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2130 పెరిగింది. ప్ర‌స్తుత ధ‌ర రూ.1,51,310 వద్ద కొనసాగుతోంది. అలాగే ఇక 22 క్యారెట్ల ధర రూ.1950 పెరిగింది. ప్ర‌స్తుతం దీని ధ‌ర రూ.1,38,700గా ఉంది. ఇక 18 క్యారెట్ల ధర రూ.1590 పెరిగింది. ప్ర‌స్తుతం దీని ధ‌ర రూ.1,13,480గా ఉంది.

అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధ‌ర రూ.5 వేలు పెరిగింది. ప్ర‌స్తుత ధ‌ర‌ రూ.2.70 లక్షలుగా ఉంది. నిన్న దీని ధ‌ర రూ.2.65 లక్షలుగా ఉంది.

24 క్యారెట్ల (తులం) – రూ.1,51,310
(రూ.2130 పెరిగింది)
22 క్యారెట్ల ధర – రూ.1,38,700గా
(రూ.1950 పెరిగింది)
18 క్యారెట్ల ధ‌ర – రూ.1,13,480
(రూ.1590 పెరిగింది)
కేజీ వెండి ధ‌ర రూ.2.70 లక్షలు
(రూ.5 వేలు పెరిగింది)

Leave a Reply