health | శతాధిక వృద్ధురాలు కన్నుమూత

health | శతాధిక వృద్ధురాలు కన్నుమూత

health | చల్లపల్లి, ఆంధ్ర ప్రభ : కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం రామానగరం బీసీ కాలనీకి చెందిన అంబటి సీతమ్మ(101) కన్నుమూశారు. నూరు సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో(perfect health) ఉన్న సీతమ్మ గత రెండు నెలలుగా వయోభారంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందారు.

ఎస్ఐఐసి ప్రముకులు అంబటి వెంకటేశ్వరరావుకు సీతమ్మ మాతృమూర్తి. అవనిగడ్డ ఎల్ఎసి బ్రాంచ్(LAC Branch) మేనేజర్ ఆకుల హరిప్రసాద్, పలువురు ప్రముకులు సీతమ్మ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Leave a Reply