32KV lines | సబ్ స్టేషన్ ఎదుట కాలనీవాసుల బైటయింపు

32KV lines | సబ్ స్టేషన్ ఎదుట కాలనీవాసుల బైటయింపు

32KV lines | చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ పరిధిలోని పద్మనగర్ కాలాని వాసులు తమ ప్లాట్ నుంచి కొత్త వెంచర్లకు విద్యుత్ శాఖ అధికారులు నూతనంగా వేస్తున్న 32కెవి లైన్ల(32KV lines) పనులు నిలిపి వేయాలని కోరుతూ ఈ రోజు మధ్యాహ్నం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్(electrical substation) ముందు బైటయించి ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల క్రింతం పద్మానగర్ పక్కన ఉన్న వెంచర్లో తాము ప్లాట్లు కొనుగోలు చేసుకున్నామని, అయితే అదే రియల్ వ్యాపారి దాని వెనుక మరో కొత్త వెంచర్ ను ప్రారంభించి తాము తీసుకున్న పాత ప్లాట్ల నుంచి హైటెన్షన్(high tension) (32కేవీ )లైన్ వేయడానికి విద్యుత్ స్తంబాలు వేసి మాకు ఆర్థిక నష్టంతో పాటు ప్రమాద కరమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇప్పటికైనా విద్యుత్ అధికారులు తమ సమస్యలను అర్థంచేసుకొని ప్రస్తుతం వేస్తున్న లైన్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేనట్లయితే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతమన్నారు.

Leave a Reply