ఘనంగా హనుమాన్ విగ్రహ వార్షికోత్సవం..

రేగొండ, ఆంధ్రప్రభ ; గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో హనుమాన్ విగ్రహాన్ని చిగురుమామిడి రాజ కొమురయ్య, సూర బాబురావు, చాకిలం నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు 25 సంవత్సరాల క్రితం ప్రతిష్టించారు. హనుమాన్ విగ్రహ 25 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ప్రధాన అర్చకులు నంది విజయ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్. గాదె వీరస్వామి, వైస్ చైర్మన్ కాడవేన దేవేందర్,కోశాధికారి.బిల్లా రాకేష్,గ్రామ సర్పంచ్ కాడవేన సరిత- యుగేoధర్, మాజీ ఎంపీటీసీ. చిగురుమామిడి కుమారస్వామి, గ్రామ కమిటీ అధ్యక్షులు బోయిని కుమారస్వామి,మాజీ సర్పంచ్ చిగురు మామిడి రజిత- రాజు ఉపసర్పంచ్. పున్నం రాజు, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొని వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది.

Leave a Reply