ఉపాధి కూలీలకు హాజరు కొలతలపై అవగాహన..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామపంచాయతీలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ పనిలో భాగంగా గ్రామంలోని పెద్ద చెరువులో గ్రామ సర్పంచ్ నేరెళ్ల రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ఎస్ఆర్పి పని ప్రదేశం సందర్శించారు.

ఉపాధి హామీ కూలీలకు రోజువారి వేతనం మొఖ గుర్తింపు హాజరు కొలతల పైన అవగాహన కల్పించారు. పని వద్ద సౌకర్యాలు కూడా కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతు చెరువు మట్టిని పొలాల్లో వేసుకోవడం వల్ల రైతులు ఉపయోగం కలుగుతుంది అని తెలిపారు.

ఉపాధి హామీ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగ పడుతుందని తెలిపారు. రోజువారి వేతనం రూ. 307 వచ్చేవిధంగా కొలతల ప్రకారం పని చేయగలరని కూలీలకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కొమరమ్మ, ఎస్ఆర్పి సోషల్ అడిట్ ప్రదీప్, ఫీల్డ్ అసిస్టెంట్ రవీందర్ ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు,

Leave a Reply