పోలీసులు మెరుపు దాడి
పోలీసులు మెరుపు దాడి
14 మంది జూదరులు అరెస్టు..
రూ.20,900లు స్వాధీనం
( గూడూరు – , ఆంధ్రప్రభ)
కృష్ణా జిల్లా గూడూరు మండలం పరిధిలో శుక్రవారం పోలీసులు అకస్మిక దాడి జరిపారు. సూరదాయిపేట గ్రామంలో కోత ముక్క పేకాట ఆడుచున్న ముగ్గురు జూదరులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 8,500 లు – నగదును స్వాధీనం చేసుకున్నారు.

రాయవరం గ్రామంలో పదకొండు (11) మంది జూదరులను పట్టుకుని రూ. 12,400/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందేలు ఇతర జూద కలాపాలను నిర్వహించినా, పాల్గొన్నా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొంటామని గూడూరు ఎస్ఐ హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.
