Grain | జాతీయ రహదారిపై ధాన్యం నిల్వలు
Grain | జాతీయ రహదారిపై ధాన్యం నిల్వలు
- పట్టించుకోని అధికారులు
ఆంధ్రప్రభ, మోపిదేవి : మోపిదేవి, చల్లపల్లి మండలాల పరిధిలో హైవేపై విచ్చలవిడిగా ధాన్యపు రాశులు పోసినా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. రాత్రిపూట జరిగే ప్రమాదాలకు హైవే అధికారులా, హైవే పెట్రోలింగ్ అధికారుల లేక పోలీసు వారు బాధ్యత వహిస్తారో తెలపాలని వాహన దారులు కోరుతున్నారు. మార్జిన్ వదిలి రోడ్డు మధ్యలో సైతం ధాన్యం పోసి రాళ్లు అడ్డుపెడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
