RTC Bus Accident | స్టీరింగ్ రాడ్ విరగడంతో…
RTC Bus Accident | స్టీరింగ్ రాడ్ విరగడంతో…
RTC Bus Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం తెన్నేరు గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన బస్సు రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీసి కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అదృష్టవశాత్తూ పెద్ద ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి బస్సు స్టీరింగ్ రాడ్ విరగడమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
