రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి..

రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి..

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు.

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గాంధీనగర్ లో గురువారం ప్రమాదవశాత్తు ధాన్యం, కొంత పంట పొలం దగ్ధమైన సందర్భంగా నష్టపోయిన రైతులు తోట రామకృష్ణ, తోట రాకేష్ వరి ధాన్యం కుప్పలను ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి తన వంతు బాధితులకు కొంత నగదు సహాయం అందించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ.. బాధిత రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని, వరి ధాన్యం కాలిపోయిన రైతు సోదరులు అధైర్య పడవద్దని నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని ప్రతీ ధాన్యం గింజ కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం, మేము తీసుకుంటున్నామని గుర్తు చేశారు. గాంధీనగర్ లో నష్టపోయిన రైతులకు అండగా నిలిచి వారికి తోడుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply