మాదకద్రవ్యాల బానిసలుగా మారితే జీవితానికి అర్ధం లేదు…

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మాదకద్రావ్యాల బానిసలుగా మారితే జీవితానికి అర్థం లేదు అని మీ తల్లితండ్రులు కష్ట పడి చదివించి పోషిస్తుంటే వారికీ గౌరవం తెచ్చే విధముగా ప్రయోజకులుగా మంచి పేరు తేవాలి అని మంచిర్యాల డిసిపీ. ఏ.భాస్కర్ అన్నారు.శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న వారితో మంచిర్యాల ఏసిపి.అర్.ప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణ ఎస్ హెచ్ ఓ.ప్రమోద్ రావు కౌన్సిలింగ్ నిర్వహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డిసిపి పాల్గొని చికిత్స పొందుతున్న వారితో ప్రత్యక్షంగా మాట్లాడుతు.. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు తిరిగి పునరావతం కాకుండా ఉండేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సమాజసేవలో ముందుండాలని తల్లిదండ్రులకు గౌరవప్రదంగా ఉండేందుకు కష్టపడి పనులు చేసుకోవాలని దిశ నిర్దేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ అడ్మిన్ వైద్యులు శ్రీమన్నారాయణ, మానసిక వైద్య నిపుణులు రామ్ నాయక్,నర్సింగ్ ఆఫీసర్లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply